రామమందిరంలో ఏం జరుగుతోంది?.. నిర్వహణపై మిశ్రా సంచలన వ్యాఖ్యలు
- రామమందిర విరాళాల వివాదం
- నిర్వహణ వ్యవస్థపై నృపేంద్ర మిశ్రా ఆందోళన
- మొత్తం యంత్రాంగాన్ని మార్చాలని సూచన
- విరాళాల లెక్కల్లో లోపాల ఆరోపణ
- పర్యవేక్షణ బలహీనంగా ఉందన్న మిశ్రా
దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామమందిరం ఇప్పుడు విరాళాల వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీస్తుండగా తాజాగా రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.
మందిర నిర్వహణ వ్యవస్థలో తీవ్రమైన లోపాలున్నాయని, మొత్తం యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నృపేంద్ర అభిప్రాయపడ్డారు. అనుభవం ఉన్న నిపుణుల చేతుల్లో నిర్వహణ బాధ్యతలు ఉండాలని సూచించారు. విరాళాల లెక్కల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆలయ ఉద్యోగి ఇంటి నుంచి నగదు స్వాధీనం కావడం కలకలం రేపింది. అనంతరం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. విరాళాల రిజిస్టర్లు, భద్రతా రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు.
అయితే ‘శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్’ఈ ఆరోపణలను ఖండించింది. తమ ఖాతాలు సక్రమంగా ఉన్నాయని, ఎలాంటి అవకతవకలు గుర్తించలేదని ట్రస్ట్ చెబుతోంది.
ఈ వివాదం తనను వ్యక్తిగతంగా చాలా బాధించిందని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ముఖ్యంగా రామమందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం విచారకరమన్నారు. ప్రస్తుతం ఆలయ నిర్వహణలో ఎక్కువ మంది స్వచ్ఛంద సేవకులే పనిచేస్తున్నారని నృపేంద్ర తెలిపారు. కానీ ఎవరి బాధ్యత ఏంటో స్పష్టంగా రాతపూర్వక ఆదేశాలు లేవని, పని విభజన కూడా సక్రమంగా జరగడం లేదని పేర్కొన్నారు.
ఆలయ ప్రాంగణంలో దాదాపు 1,500 మంది వివిధ పనుల్లో పాల్గొంటున్నారని, ఇంత పెద్ద వ్యవస్థను కేవలం అనధికారిక పద్ధతుల్లో నడపడం సరైన విధానం కాదన్నారు. భక్తుల విరాళాల నిర్వహణకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని కూడా వెల్లడించారు. 2023 నుంచి 2025 మధ్య జారీ చేసిన పలు ఆదేశాలను తాను పరిశీలించానని చెప్పారు.
విరాళాల లెక్కింపు గదిలోకి వెళ్లే సిబ్బంది ఏ దుస్తులు ధరించాలి, లోపలికి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు ఎలా తనిఖీలు చేయాలి వంటి అంశాల వరకు నిబంధనలు ఉన్నాయని మిశ్రా తెలిపారు. అయితే అవి పూర్తిగా అమలు కాలేదన్న సమాచారం తనకు అందిందన్నారు. భక్తులు నగదు మాత్రమే కాదు, బంగారు ఉంగరాలు, నగల వంటి విలువైన వస్తువులను కూడా విరాళంగా సమర్పిస్తారని గుర్తుచేశారు. అలాంటి సమయంలో నగదు, నాణేలు, విలువైన లోహాల లెక్కల్లోనూ లోపాలు జరిగినట్లు తనకు అనిపిస్తోందన్నారు.
అసలు సమస్య కేవలం లెక్కల దగ్గరే లేదని, పర్యవేక్షణ వ్యవస్థ కూడా బలహీనంగా ఉందని మిశ్రా వ్యాఖ్యానించారు. బ్యాంకు ప్రతినిధులు, ట్రస్ట్ ప్రతినిధులు మొత్తం ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉన్నా, అది ఆశించిన స్థాయిలో జరగలేదని తెలిపారు. విరాళాలు లెక్కించిన తర్వాత వాటిని బ్యాంకులకు తరలించే దశలో కూడా తగిన పర్యవేక్షణ లేదన్నారు. ఎక్కడో ఓచోట పర్యవేక్షణలో లోపం జరిగిందని అభిప్రాయపడ్డారు. నిజాయతీతో పాటు కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని, ఈ రెండు అంశాల్లోనూ వైఫల్యం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.